TG: రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే జరగనుంది. మొత్తం 75 ప్రశ్నలతో సర్వే నిర్వహించనున్నారు. 56 ప్రధాన ప్రశ్నలు కొన్నింటికి ఉపప్రశ్నలు వేసి సమాచారం సేకరించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సర్వేలో కుటుంబ యజమాని, సభ్యుల వివరాలతో పాటు విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న కుటుంబసభ్యుల వివరాలూ నమోదు చేయనున్నారు. ప్రజలు తీసుకున్న రుణాలు, స్థిర, చరాస్తుల వివరాలు సేకరించనున్నారు.