AP: రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుందని మాజీ CM జగన్ విమర్శించారు. దేవుడి దగ్గరికి వెళ్లే.. కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నాన్ని తన రాజకీయంలో ఎప్పుడూ చూడలేదని ధ్వజమెత్తారు. తాను తిరుమలకు అనుమతి లేదని.. YCP నాయకులు పాల్గొంటే.. అరెస్టు చేస్తామని నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. అంతేకాకుండా వేరే రాష్ట్రాల నుంచి BJP వాళ్లను తిరుమలకు రప్పిస్తున్నారని.. చంద్రబాబు పాలనను డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ఆరాటం పడుతున్నారని ప్రశ్నించారు.