సినీ హీరోగా జీవితాన్ని ప్రారంభించిన విజయ్ దళపతి.. ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా విల్లుపురంలో నిర్వహించిన మొదటి సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కుటుంబం రాష్ట్రాన్ని లూటీ చేస్తోందని ఆరోపించారు. ‘రాజకీయాల్లో చిన్న పిల్లాడినంటూ విమర్శిస్తున్నారు. చిన్న పిల్లాడినే కానీ, భయపడను. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. అన్ని తెలిసే రాజకీయాల్లోకి అడుగుపెట్టా’ అని పేర్కొన్నారు.