నల్ల మిరియాలు ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మిరియాలు రోగనిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా కాపాడుతాయి. అంతేకాకుండా వీటిని తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. నల్ల మిరియాల్లో విటమిన్ సి, విటమిన్ ఏ, ప్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. వీటిని తీసుకోవడం వల్ల దగ్గు కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.