TG: మాజీ మంత్రి మల్లారెడ్డి మనువరాలు, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహ మహోత్సవ కార్యక్రమం శంషాబాద్‌లోని ఓ కన్వేషన్‌లో ఘనంగా జరిగింది. మల్లారెడ్డి ఆహ్వానం మేరకు ఈ వివాహ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.