మతపరమైన అల్లర్లతో పాకిస్థాన్ అట్టుడుకుతుంది. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో గత వారం రోజుల నుంచి ఇస్లాం, షియా వర్గానికి చెందిన తెగల మధ్య మత ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 37 మంది మృతి చెందారు. దాదాపు 150 మంది గాయపడ్డారు. ఈ గొడవల్లో 28 ఇళ్లు దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.