AP: తిరుమలలో శాంతి హోమం నిర్వహించిన ఆచార్యపురుషుల సూచనల మేరకు శ్రీవారి భక్తులు ఈరోజు సాయంత్రం 6 గంటలకు తమ ఇళ్లలో దీపారాధన చేస్తూ ‘క్షమ మంత్రం’ పఠించాలని భక్తులకు టీటీడీ సూచించింది. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వేంకటేశాయ మంత్రాలను జపించి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యానుగ్రహాన్ని పొందాలని తెలిపింది. కాగా స్వామివారి లడ్డూ కల్తీ నేపథ్యంలో తిరుమలలో ఇవాళ ఉదయం శాంతిహోమం నిర్వహించిన విషయం విధితమే.