TG: బీఆర్ఎస్ భారీ కుట్ర పన్నిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. నిరుద్యోగుల జీవితంతో చెలగాటం ఆడాలని చూశారని మండిపడ్డారు. తమ ర్యాలీలోకి చొరబడి విధ్వంసం చేసే కుట్రపన్నారని.. ఏం తెలియనట్టు ర్యాలీలో పాల్గొనే ప్రయత్నం చేశారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలను యువత అడ్డుకున్నారని గుర్తు చేశారు. బీజేపీకి వస్తున్న స్పందన చూసి బీఆర్ఎస్ తట్టుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. బీజేపీ కార్యకర్తలను కేసుల్లో ఇరికించాలని చూశారని ఆరోపించారు.