తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు గతంలో వచ్చిన వార్తలను ప్రముఖ నటి నయనతార ఖండించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తన ముఖాన్ని ఎప్పుడూ మార్చుకోవాలని ప్రయత్నించలేదని వెల్లడించారు. ఆహారపు అలవాట్లలో చేసుకున్న మార్పుల వల్ల మొహంలో మార్పు వచ్చినట్లు పేర్కొంది.