TG: బెటాలియన్ కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించటంపై మాజీమంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్మిస్ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కోరితే 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించటం హేయమైన చర్య అని పేర్కొన్నారు. తాను పోలీసు కుటుంబం నుంచి వచ్చానని.. పోలీసుల కష్టాలు తెలుసని గతంలో చెప్పిన రేవంత్.. ఇలా వ్యవహరించటం దుర్మార్గమని అన్నారు.