అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో.. ఈనెల 5న జరగనున్నాయి. 24 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు సమాచారం. ప్రధానంగా ఏడు రాష్ట్రాలతోనే డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు ట్రంప్ భవితవ్యం తేలనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అరిజోనా, జార్జియా, మిచిగావ్, నెవడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాలు కీలకం కానున్నాయి.