TG: సికింద్రాబాద్ పరిధిలోని ప్రకాశ్‌నగర్‌లో ఆహార భద్రత, టాస్క్ఫోర్క్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ చికెన్ సెంటర్లో 700కిలోల కుళ్లిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కుళ్లిన కోడి మాంసం, కోడి ఎముకలకు కెమికల్స్ కలిపి.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, మద్యం దుకాణాలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చికెన్ సెంటర్ యజనానిపై కేసు నమోదు చేసి, ఆ దుకాణాన్ని సీజ్ చేశారు.