AP: డిసెంబర్ చివరికల్లా అన్ని టెండర్లు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వం రాజధానితో మూడు ముక్కలాట ఆడిందన్నారు. రూ.30 వేల కోట్ల టెండర్ల పనులు మొదలయ్యాయని, మంత్రులు, జడ్జిలు, ఇతర బంగ్లాలకు రూ.41 వేల కోట్ల టెండర్లు పిలిచినట్లు తెలిపారు. జూలై 24న చీఫ్ ఇంజినీర్లతో సాంకేతిక కమిటీ వేశామన్నారు. 2014-19లో ఇచ్చిన టెండర్ పనులకు గడువు ముగిసిందన్నారు. పనులకు సంబంధించి సీఈసీ అక్టోబర్ 29న నివేదిక ఇచ్చిందన్నారు.