డిజిటల్ అరెస్టులతో భారతీయులు రూ.120కోట్లు మోసపోయినట్లు హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్రేడింగ్, పెట్టుబడులు, డేటింగ్ యాప్ వంటి మోసాలన్నీ కలిపితే ఆ మొత్తం రూ.1776 కోట్లు ఉంటుందని తెలిపింది. సైబర్ నేరగాళ్లలో 46 శాతం మంది మయన్మార్, లావోస్, కంబోడియాకు చెందిన వారేనని నివేదికలో పేర్కొంది. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మన్‌కీ బాత్‌లోనూ ప్రధాని మోదీ కోరారు.