AP: యువతను ఆకశమే హద్దుగా ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. పరిశ్రమలను పెద్దఎత్తున రప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పించేవారు కూడా ముందుకు రావాలని కోరారు. టెక్కలి లేదా పలాసలో విమానాశ్రయం తీసుకొస్తామని, మూలపేటలో 10వేల ఎకరాల్లో ఇండస్ట్రీయల్ కారిడార్ తెస్తామని పేర్కొన్నారు. ఇచ్ఛాపురం టీడీపీకి కంచుకోట, అర్హులైన అందరికీ ఇళ్లు, రేషన్ కార్డు, పెన్షన్లు ఇస్తామని పేర్కొన్నారు.