AP: వైసీపీ అధినేత జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. వైఎస్ షర్మిలతో ఆస్తుల వివాదంపై ఆయన స్పందించారు. తనకు చిన్న ఇల్లు ఉందని 2004 ఎన్నికల సమయంలో చూపించిన జగన్.. సీఎం అయిన తర్వాత రూ.8 లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించారు. జగన్కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని అన్నారు. ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చారని మండిపడ్డారు.