AP: సీఎం చంద్రబాబు ఎప్పుడూ కొత్త ఆలోచనలు చేస్తుంటారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అమరావతి డ్రోన్ సమ్మిట్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. ‘విజయవాడలో వరదల సమయంలో డ్రోన్లు ఎంతో ఉపయోగపడ్డాయి. యువతతో పోటీ పడి చంద్రబాబు పనిచేస్తున్నారు. నూతన సాంకేతికత వినియోగంపై సీఎం చర్చలు జరపుతుంటారు. దేశాభివృద్ధికి ఎప్పుడూ ఆలోచనలు చేస్తున్న వ్యక్తి ప్రధాని మోదీ. ప్రపంచ దేశాలు భారత్ అభివృద్ధిని గమనిస్తున్నాయి’ అని చెప్పారు.