TG: సమగ్ర కుటుంబ సర్వేలో కులం, మతం వెల్లడించని వారిపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నో కాస్ట్, నో రిలిజియన్ కాలమ్‌లను పెట్టాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని పరిశీలించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఏం నిర్ణయం తీసుకున్నారో పిటిషనర్‌కు సమాచారం అందించాలంది. ఈ మేరకు సంబంధిత ముఖ్యకార్యదర్శులకు, బీసీ కమిషన్లకు నోటీసులు జారీ చేసింది.