TG: కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ విధానమే మోసమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇదే దౌర్భాగ్యమని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. కర్ణాటక సీఎం భార్య స్వయంగా ప్రభుత్వ భూమిని తన పేరు మీద రాయించుకుందని చెప్పారు.