TG: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన తన మేనిఫెస్టోను అనుసరించట్లేదని కేంద్రమంత్రి అన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని రాష్ట్రంలోని మాజీ సర్పంచులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారని.. అయినా వారిని పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదిగ్గా స్పందించారు.