TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. చేనేత కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. బతుకమ్మ చీరలు ఎప్పుడు పంపిణీ చేస్తారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ దిక్కుమాలిన ప్రభుత్వమని, వాళ్లకు బుర్రలేదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం నేతన్నలకు సరిపడ పని కల్పించిందన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.