అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పెన్సిల్వేనియాలో జరుగుతోన్న ఓటింగ్ ప్రక్రియపై అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘పెన్సిల్వేనియాలో భారీ మోసం జరుగుతుంది. దానిపై చర్చలు జరుగుతున్నాయి. చట్టం అమలులోకి వస్తుంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మరోవైపు ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని రిపబ్లికన్‌కు చెందిన సిటీ కమిషనర్ సేథ్ బ్లూస్టెయిన్ తెలిపారు.