AP: ఈజ్ ఆఫ్ లివింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాష్ట్ర ప్రభుత్వ నినాదమని CS నీరబ్ కుమార్ అన్నారు. డ్రోన్ సమ్మిట్లో మాట్లాడిన ఆయన.. ‘పెరుగుతున్న డ్రోన్ల వినియోగాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. యువ పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాం. అభివృద్ధి చెందే ఈ రంగంలో యువతకు శిక్షణ ఇస్తాం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది’ అని వెల్లడించారు,