దేశవ్యాప్తంగా నమోదైన SC,ST అట్రాసిటీ కేసుల్లో 97.7% కేసులు కేవలం 13 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 51,656 కేసులు నమోదైతే 12,287 కేసులతో UP తొలి స్థానంలో నిలవగా.. రాజస్థాన్ 8,651 కేసులతో, MP 7,732 కేసులతో 2,3వ స్థానంలో నిలిచాయి. బీహార్ 6,799 కేసులు, ఒడిశా 3,576 కేసులు, మహారాష్ట్ర 2,706 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అంటే 81% అట్రాసిటీ కేసులు ఈ 6 రాష్ట్రాల్లోనే నమోదుకావడం గమనార్హం.