గ్రీన్ టీని అతిగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మోతాదుకు మించి తాగితే తలనొప్పి, విరేచనాలు అవుతాయి. కొన్నిసార్లు ఖాళీ కడుపుతో దీన్ని తాగితే వాంతులవుతాయి. చికాకును కలిగించడంతో పాటు అందులో ఉండే కెఫిన్ కడుపులో గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుందట. తద్వారా అసిడిటీ వస్తుంది. అలాగే నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. ఎముకలు బలహీనమవుతాయి. రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువగా గ్రీన్ టీ తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు.