ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ ప్రాతినిధ్యం కోసం ప్రపంచ దేశాల నుంచి మద్దతు పెరుగుతుంది. అయితే కేవలం చైనా మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్లు ఇప్పటికే భారత్కు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనాలు శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి.