»Soaked Superfood Which You Can Eat In The Morning Will Increase Your Energy
Soaked Food : వీటిని నానబెట్టి తినండి.. రోగాలన్నీ పరార్
కరోనా వైరస్ పుణ్యమాని ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధపెరిగింది. ఖర్చు ఎక్కువైన ఫర్లేదు కానీ పోషకాహారానికే జై కొడుతున్నారు. ఇటువంటి ఆహారాలు మనకు శక్తిని ఇవ్వడమే కాకుండా.. అనేక వ్యాధుల నుండి మనలను కాపాడతాయి.
Soaked Food : కరోనా వైరస్ పుణ్యమాని ప్రతి ఒక్కరికి ఆరోగ్యం(Health)పై శ్రద్ధపెరిగింది. ఖర్చు ఎక్కువైన ఫర్లేదు కానీ పోషకాహారానికే జై కొడుతున్నారు. ఇటువంటి ఆహారాలు మనకు శక్తిని ఇవ్వడమే కాకుండా.. అనేక వ్యాధుల నుండి మనలను కాపాడతాయి. కొన్ని ఆహారాలను రాత్రిపూట నానబెట్టి ఉదయం తింటే వాటి పోషక విలువలు పెరుగుతాయి. ఉదయాన్నే వీటిని తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అందుకే వాటికి సూపర్ ఫుడ్స్ హోదా ఇవ్వబడింది. ప్రముఖ పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం అవి ఏంటో తెలుసుకుందాం. .
1)ఎండు ద్రాక్ష(Raisins)ను పొడిగా కూడా తినవచ్చు. కానీ వాటిని నానబెట్టి తింటే.. అవి ఐరన్ కంటెంట్‌ను పెంచుతాయి. ఇది జుట్టు రాలడం, చర్మ సమస్యలను నయం చేస్తుంది.
2) బాదంపప్పు(almonds) తినడం వల్ల మెదడు చురుకుగా మారుతుంది. బరువు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుందని అంటారు. ఇందులో మెగ్నీషియం(magnesium) పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది . రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి దీనిని నానబెట్టి తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.
3) అత్తి పండ్లలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పోషకాలు అధికంగా ఉండే పండు. ఇందులో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ప్రమాదాల నుండి రక్షిస్తాయి. ఎండిన అంజీర పండ్లను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తినండి.
4)అవిసె గింజల(Flaxseeds)లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ గింజలను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తినండి.
4)మెంతులు(fenugreek seeds) మనకు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని ఇస్తాయి. ఇది కడుపుకు కూడా మంచిది. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల మలబద్ధకం(constipation) నుండి ఉపశమనం పొందవచ్చు. దీని కోసం మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయం దాని నీటిని త్రాగాలి.