• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మణిపూర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మోదీ

మణిపూర్ చురాచాంద్‌పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు PM మోదీ శంకుస్థాపనలు చేశారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు. ‘మణిపూర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఎన్నో ప్రాజెక్టులు చేపట్టాం. ఐటీ స్పెషన్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేస్తున్నాం. కోల్‌కతా, ఢిల్లీల్లో మణిపూర్ భవనాల నిర్మాణం జరిగింది. GSTని తగ్గించాం. దీంతో హోటల్ ధరలు తగ్గి టూరిజం పెరుగుతుంది’ అని అన్నారు.

September 13, 2025 / 04:02 PM IST

సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి చేద్దాం: కలెక్టర్

KRNL: జిల్లాను సమిష్టి కృషితో అభివృద్ధి చేద్దామని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి జిల్లా అధికారులతో పేర్కొన్నారు. ఇవాళ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్‌గా ఇది తన మొదటి పోస్టింగ్ అని, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అధికారులందరూ సహకరించాలని కోరారు. ప్రజలకు ఏ సమస్య వచ్చిన జిల్లా యంత్రాంగం మొత్తం వెంటనే స్పందించాలని తెలిపారు.

September 13, 2025 / 04:01 PM IST

కవిత వ్యాఖ్యలకు కేటీఆర్ సమాధానం చెప్పాలి: TPCC

TG: BJP, BRS విషయంలో కవిత వ్యాఖ్యలపై KTR సమాధానం చెప్పాలని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డికి BRS ఎందుకు ఓటు వేయలేదని ప్రశ్నించారు. BJP, BRS వేరు కాదు.. లోపాయికారీ ఒప్పందంలో ఉన్నారని విమర్శించారు. కవిత వ్యాఖ్యలపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

September 13, 2025 / 04:01 PM IST

‘మోదీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి’

JN: పాలకుర్తిలో బీజేపీ నేతలు సేవా పక్షం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లేగ రామ్మోహన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు.

September 13, 2025 / 04:00 PM IST

నేల కూలిన భారీ వృక్షం.. తప్పిన ప్రమాదం

ATP: గుత్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సమీపంలో శనివారం ఓ భారీ వేప వృక్షం నేలకూలింది. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వృక్షం కూలిపోయింది. వృక్షం నేలకూలిన సమయంలో జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెట్టు కూలిపోయిన విషయాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

September 13, 2025 / 04:00 PM IST

గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే ముప్పిడి

E.G: కొవ్వూరులోని టీడీపీ కార్యాలయం వద్ద కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శనివారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలు, అవసరాలను వివరించారు. హెల్త్ పింఛన్లు మంజూరు చేయాలని, రెవెన్యూ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని, బస్ సర్వీసులపై వినతిపత్రాలను అందజేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

September 13, 2025 / 04:00 PM IST

ఎడ్యుటెక్ స్టడీ సెంటర్‌ను ప్రారంభించిన ఎంపీ హరీష్

కోనసీమ: పి.గన్నవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎడ్యుటెక్ స్టడీ సెంటర్‌ను అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. తమ సంస్థలో చేరే విద్యార్థులను పూర్తి స్థాయిలో తీర్చి దిద్దాలని కోరారు. భవిష్యత్తులో జిల్లాలో మరిన్ని బ్రాంచ్‌లు ఏర్పాటు చేయాలన్నారు.

September 13, 2025 / 04:00 PM IST

సర్పంచ్‌ను పరామర్శించిన మడకశిర వైసీపీ ఇంఛార్జ్

సత్యసాయి: గుడిబండ మండలం మందలపల్లి సర్పంచ్ అశ్వర్ధ అనారోగ్యంతో తుంకూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మడకశిర వైసీపీ ఇంఛార్జ్ ఈర లక్కప్ప ఆస్పత్రికి వెళ్లి సర్పంచ్‌ను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

September 13, 2025 / 04:00 PM IST

BREAKING: 14 జిల్లాలకు కొత్త SPల నియామకం

AP; రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. వీటిలో 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులను, మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేసింది. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

September 13, 2025 / 03:59 PM IST

మద్యం సేవించి మందుబాబు హాల్ చల్

CTR: ఎస్ఆర్ పురం మండలం ఎగువ కమ్మ కండ్రిగ పంచాయతీ వడ్డీ కండిగ గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి మద్యం సేవించి రోడ్డుపై హాల్చల్ చేశారు .దిగువ కమ్మ కండ్రిగకు వెళ్లే రోడ్డుపై శనివారం కారు నుంచి ప్రయాణికుల రాకపోకలని అడ్డుకున్నాడు. ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఆర్ పురం పోలీసులు మందు బాబుని అదుపులోకి తీసుకొని కారును స్వాధీనం చేసుకున్నారు.

September 13, 2025 / 03:58 PM IST

బిట్‌కాయిన్ పేరుతో భారీ సైబర్ మోసం

MHBD: జిల్లాలో బిట్‌కాయిన్ ట్రెండింగ్ పేరుతో భారీ మోసం నేడు వెలుగులోకి వచ్చింది. మెడికల్ షాప్ నిర్వాహకుడికి వాట్సాప్‌లో లింక్ పంపి, బిట్‌కాయిన్‌లో పెట్టుబడితో లాభాలు వస్తాయని నమ్మించి, మొదట రూ.50 వేలు, అనంతరం రూ.5 లక్షలు తీసుకున్నారు. వాలెట్‌లో రూ.10 లక్షలు కనిపించేలా చేసి, రూ.32,53,000 దోచుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

September 13, 2025 / 03:58 PM IST

దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్

MNCL: లక్షేటిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్ధులకు దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్15, 16వ తేదీలలో నిర్వహించానున్నామని ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ తెలిపారు. దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్ధులు 17న ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాలని, అదే రోజు విద్యార్థులకు సీట్లను కేటాయిస్తామన్నారు.

September 13, 2025 / 03:57 PM IST

ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు

HNK: ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ ఎన్ఎస్ఆర్ హోటల్ ఎదురుగా ఇటీవల జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. సిఐ సంతోష్, రోడ్డు సేఫ్టీ సిఐ శ్రీనివాస్, ఆర్ఎస్ఐ బృందం, పరకాల డిపో మేనేజర్‌తో కలిసి ప్రమాద స్థలాన్ని ఇవాళ పరిశీలించారు. జాతీయ రహదారిపై సిగ్నల్ పాయింట్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతునాయన్నారు. సమస్యను పరిష్కరించాలని ఎన్‌హెచ్ అధికారులను కోరారు.

September 13, 2025 / 03:56 PM IST

RRRను కలిసిన చిత్తూరు MLA

CTR: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజును శనివారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ స్పీకర్ బెంగళూరు నుంచి చిత్తూరు మీదుగా తిరుమలకు వెళ్లే క్రమంలో ఇరువారం బైపాస్ సర్కిల్ వద్ద ఎమ్మెల్యే కూటమి నాయకులతో ఆయన్ను కలిశారు. ఈ నేపథ్యంలో బొకే అందజేసి స్వాగతం పలికారు.

September 13, 2025 / 03:56 PM IST

కలెక్టర్‌‌ను కలసిన ఎస్పీ

PPM: జిల్లా నూతన కలెక్టర్‌గా శనివారం బాధ్యతలు స్వీకరించిన ఎన్.ప్రభాకర రెడ్డిని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం గురించి, శాంతి భద్రతల పరిరక్షణ గురించి ఎస్పీతో కలెక్టర్‌ చర్చించారు.

September 13, 2025 / 03:56 PM IST