»Indian Woman Ran 42 5 Km In England Wearing A Saree People Said Proud
Marathon : చీరతో 42.5కిలోమీటర్లు పరిగెత్తిన మహిళ
మధుస్మిత మాంచెస్టర్లో జరిగిన మారథాన్లో పాల్గొంది. 4 గంటల 50 నిమిషాల్లో 42.5 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసింది. సోషల్ మీడియాలో జనాలు మధుస్మితపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె కట్టుకున్న చీర చాలా ప్రత్యేకమైంది. ఒడిశా ప్రజలు దానిని ఒడియా సంస్కృతి ప్రతిబింబేందుకు ఈ చీర ధరిస్తారు.
Marathon : యూకేలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన ఓ మహిళ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మహిళ చీర కట్టుకుని పరిగెడుతున్నట్లు ఈ చిత్రంలో చూడవచ్చు. భారతదేశంలోని ఒడిశాకు చెందిన ఈ మహిళ పేరు మధుస్మిత జానా. ఆమె వయస్సు 41 సంవత్సరాలు. ఆమె మాంచెస్టర్(Manchester)లో జరిగిన మారథాన్(Marathon)లో పాల్గొంది. 4 గంటల 50 నిమిషాల్లో 42.5 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసింది. సోషల్ మీడియాలో జనాలు మధుస్మితపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె కట్టుకున్న చీర చాలా ప్రత్యేకమైంది. ఒడిశా(Odisha) ప్రజలు దానిని ఒడియా సంస్కృతి ప్రతిబింబేందుకు ఈ చీర ధరిస్తారు. అందమైన చీర సంబల్పురి(Sambalpuri Saree)కి చెందినది. సోషల్ మీడియాలో ఆమెను చూసిన నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది మొత్తం మన జాతికి గర్వకారణమంటూ కామెంట్లు చేస్తున్నారు.
dashman207 అనే ట్విట్టర్ యూజర్ ఈ చిత్రాన్ని షేర్ చేశారు. అతను తన ట్వీట్లో ఇలా వ్రాశాడు- UKలోని మాంచెస్టర్లో నివసిస్తున్న ఒడియా కమ్యూనిటీ మహిళ, సంబల్పురి చీర ధరించి మారథాన్లో పాల్గొంది. ఇది చాలా సంతోషకరమైన క్షణం. ఇది యావత్ సమాజానికి గర్వకారణం.
An Odia living in Manchester, UK ran the UK’s second largest Manchester Marathon 2023 wearing a Sambalpuri Saree !
What a great gesture indeed 👏 Loved her spirit 👍#Sambalpur you have a distinct inclusive cultural identity that arises from the strong association of the… pic.twitter.com/zqsUtQcO4e