AP: సోషల్ మీడియాల్లో కుటుంబసభ్యులపై అసభ్య పోస్టులు పెడుతుంటే మాజీ సీఎం జగన్ ఎందుకు నోరు విప్పడం లేదని మంత్రి పార్థసారథి ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలపై మాట్లాడలేక తాను రాష్ట్రానికి చేసిన నష్టం ఎక్కడ బయట పడుతుందోనని జగన్ ఎదురుదాడికి దిగారని విమర్శించారు. సొంత చెల్లిని, తల్లిని తిడుతున్నా జగన్ మాట్లాడడం లేదంటే ఆయన మనస్తత్వమేంటో ఆలోచించాలని పేర్కొన్నారు. అసభ్య పోస్టులపై చైతన్యపరుస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.