ప్రస్తుత రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ ప్రవర్తన.. ఆ పదవి గౌరవానికి విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఆయన ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, తరచూ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారని ఆరోపణలు చేశారు. రాజ్యసభలో ప్రస్తుతం నియమాల కన్నా రాజకీయాలే ప్రాధాన్యంగా కొనసాగున్నాయని, ఛైర్మన్ పక్షపాతంగా వ్యవహరించారని మండిపడ్డారు.