మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. BJP నేతృత్వంలోని NDA మిత్రపక్షాలకు, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష పార్టీలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షలా మారాయి. వీటితో పాటు ప్రియాంక గాంధీ తొలిసారి పోటీ చేసిన వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికల ఫలితాలు ఇవాళే వెలువడనున్నాయి.