TG: హామీల అమలులో రేవంత్ సర్కార్ విఫలమైందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTR విమర్శించారు. BC డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి చేతివృత్తులదారుల గొంతు కోశారని, కొత్త పథకాల మాట దేవుడెరుగు.. ఉన్న పథకాలకే పాతరేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ BC డిక్లరేషన్ ప్రకటించి ఏడాది అయ్యిందన్నారు. రేవంత్ ప్రభుత్వం రాగానే BC బంధు, రైతుబంధును బంద్ చేశారని ఫైర్ అయ్యారు.