రష్యా పర్యటనకు వెళ్లిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో రక్షణ రంగంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇరు దేశాల స్నేహబంధం శిఖరం కంటే ఎత్తైనదని, సముద్రం కన్నా లోతైనదని పేర్కొన్నారు.