AP: ఇసుక ఉచిత సరఫరా లోపాలపై కలెక్టర్కు టిప్పర్ యజమానుల సంఘం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టిప్పర్ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి నిడమానూరి ఫణి ఫిర్యాదు అందజేశారు. ఇసుక సరఫరాలో గుత్తేదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి టిప్పర్ యజమానులను ఆదుకోవాలని నిడమానూరి ఫణి విజ్ఞప్తి చేశారు.