AP: ఈనెల 24, 25న కలెక్టర్ల సదస్సు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది. తొలిసారి జరిగిన కలెక్టర్ల సమావేశంలో చర్చించిన, తీసుకున్న నిర్ణయాలకు తగ్గట్లు పురోగతి వివరించేలా నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గడిచిన నాలుగు నెలల్లో ప్రభుత్వ శాఖల వారీగా నివేదిక సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.