AP: కాకినాడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయనకు సంబంధించిన మరో రొయ్యల శుద్ధి పరిశ్రమ మూసివేతకు కాలుష్య నియంత్రణ మండలి విశాఖ జోనల్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిశ్రమలో తనిఖీలు నిర్వహించగా.. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీంతో ఉత్పత్తి నిలిపివేయమని ఉత్తర్వులిచ్చింది. కాగా, గతంలోనూ ద్వారంపూడికి చెందిన రొయ్యలశుద్ధి పరిశ్రమను ఆగస్టు 6న అధికారులు మూసివేయించారు.