రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఎడతెగని యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా ఉక్రెయిన్ను హెచ్చరించింది. రానున్న రోజుల్లో రష్యా మళ్లీ సరికొత్త మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే అవకాశం ఉందని అమెరికా అధికారులు హెచ్చరించారు. కాగా, ఇటీవల రష్యా తన వద్ద ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.