పార్లమెంట్లో రాజ్యాంగ వజ్రోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ ఓంబిర్లా ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న కోట్లాది భారతీయులకు అభినందనలు తెలిపారు. 75 ఏళ్ల ముందు ఈ పవిత్ర ప్రదేశంలోనే రాజ్యాంగం ఆమోదం పొందిందని గుర్తు చేశారు. దేశమంతా ఐక్యంగా రాజ్యాంగ దినోత్సవాలు జరుపుకోవాలని సూచించారు. దేశ పౌరులు రాజ్యాంగ పీఠిక సామూహిక పఠన సంకల్పం తీసుకోవాలన్నారు.