AP: సోషల్ మీడియాలపై కేసుల్లో తొలి ముద్దాయిగా వైసీపీ అధినేత జగన్ను చేర్చాలని MLA జీవీ ఆంజనేయులు ఆరోపించారు. రాష్ట్రంలో ఐదేళ్లపాటు శాంతిభద్రతలను రౌడీ మూకల చేతుల్లో పెట్టారని మండిపడ్డారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే జగన్ మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారని ‘X’ వేదికగా విమర్శించారు. సొంత తల్లి, చెల్లిపై తప్పుడు పోస్టులు పెట్టించిన హీన మనస్తత్వం గల వ్యక్తి అని ఎద్దేవా చేశారు.