TG: ఇవాళ HYDలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. గ్రేటర్ పరిధిలో రూ.150 కోట్లతో చేపట్టిన పలు సుందరీకరణ పనులు మొదలుపెట్టనున్నారు. రూ.3,500 కోట్లతో రహదారి పనుల్లో భాగంగా 7 ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, KBR పార్క్ చుట్టూ చేపట్టబోయే 6 జంక్షన్ల అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద ఎస్టీపీని, నగరంలో రెండో అతి పొడవైన ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారు.