TG: కాంగ్రెస్ సర్కార్ అవినీతి చేయదని కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిన కేసీఆర్.. తెలంగాణను తానే నిర్మించినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మీ అవినీతి క్షేత్రాలను కూల్చడమే కాంగ్రెస్ లక్ష్యమని, KCRను భరించే ఓపిక తెలంగాణ సమాజానికి లేదని పేర్కొన్నారు. కేసీఆర్ను కూల్చిన వ్యవస్థలకు పునరుజ్జీవం పోస్తున్నామని, మూసీ ప్రజలకు ప్రత్యామ్నాయం చూపుతామని తెలిపారు.