రష్యాకు ఉక్రెయిన్‌తో యుద్ధంలో సహకరిస్తున్నారన్న ఆరోపణలపై 12కు పైగా భారతీయ కంపెనీలు, ఇద్దరు పౌరులపై అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో 400+ సంస్థలు, వ్యక్తులు ఉన్నారు. వీరు యుద్ధానికి అవసరమైన పరికరాలను రష్యాకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపించింది. సిక్కు వేర్పాటువాది పన్నూ హత్య కుట్రలో భారత మాజీ గూఢాచారి ప్రమేయంపై అమెరికా అభియోగాలు మోపిన తర్వాత తాజా ఆంక్షలు చర్చకు దారి తీశాయి.