మామిడి ఆకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు తెలుపతున్నారు. వీటిలో సి,బి,ఎ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, బయో యాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయట. వీటిని నీళ్లలో మరగబెట్టి ఆ నీరు తాగితే షుగర్ అదుపులోకి వస్తుందంటున్నారు. అలాగే హైబీపీకి కూడా చెక్ పెట్టొచ్చంటున్నారు. ఆస్తమా, బ్రాంకైటిస్ తగ్గుతుందట. అలాగే ఆర్థరైటిస్ నొప్పులతో బాధ పడుతున్నవారు కూడా ఈ ఆకును తిన్నా, మరిగించిన నీరు తాగినా నొప్పుల నుంచి బయట పడవచ్చునట