నెల్లూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కూటమి పార్టీల సమన్వయ సమావేశంలో మంత్రి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాకు తనకు దశాబ్దాలుగా అనుబంధం ఉందని తెలిపారు. నామినేటెడ్ పదవులు, సభ్యత్వ నమోదుపై దృష్టి సారించామని వెల్లడించారు. కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సోమశిల-కండలేరు జలాశయాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.