AP: కోడెల విగ్రహాన్ని అనుమతులతో గౌరవప్రదంగా ప్రతిష్టిద్దామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ‘కోడెలకు టీడీపీలో ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుంది. కోడెల గౌరవ మర్యాదలకు ఎక్కడా భంగం వాటిల్లదు. వాటి విగ్రహాలు దొంగచాటున పెట్టాల్సిన అవసరం లేదు. ఉద్దేశ్యపూర్వకంగా కొన్ని శక్తులు సమస్యలు సృష్టిస్తే సహించేది లేదు. సీఎంను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు ఎందుకు వదిలేస్తున్నారు’ అని ప్రశ్నించారు.