మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కూటమి ‘మహాయతి’పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. BJP, శివసేన, NCP సారథ్యంలో కొనసాగుతున్న మహాయతి కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆరోపించారు. పెద్ద పెద్ద హామీలేవీ అమలు చేయలేదని అన్నారు. గతేడాది రిజర్వాయర్లలో 40 శాతం తాగునీరు ఉండగా.. ప్రస్తుతం 19 శాతం మాత్రమే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.