సరిహద్దు నదుల నీటి భాగస్వామ్యంపై బంగ్లాదేశ్ త్వరలో భారత్తో చర్చించనుంది. ఈ విషయాన్ని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మీడియాకు తెలిపారు. 2011లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఢాకా పర్యటన సందర్భంగా, తీస్తా నీటి భాగస్వామ్యంపై భారత్-బంగ్లాదేశ్ ఒక ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంది. అయితే నాడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ రాష్ట్రంలో నీటి కొరత కారణంగా ఈ ఒప్పందాన్ని నిరాకరించారు.