TG: కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి ఎంతో సేవ చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. తమకంటూ వేరే కుటుంబం లేదని.. ప్రజలే తమ కుటుంబమని పేర్కొన్నారు. యంగ్ ఇండియా విద్యాసంస్థలను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని.. ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థల్లో అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. తనను వరుసగా ఏడు సార్లు గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.