బతుకమ్మను పేర్చటానికి గునుగు పూలను వాడుతారు. తెలుపు, గులాబీ రంగుల్లో ఉండే ఈ పూలని అలంకరణల్లో ఉపయోగిస్తారు. బీడు భూముల్లో పెరిగే ఈ గడ్డి జాతి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. గునుగు మొక్కకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. వీటి ఆకులు గాయాలు, పుండ్లను తగ్గిస్తాయి. హైబీపీని నియంత్రిస్తాయి. యూరినరీ ఇన్ఫెక్షన్లు, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తాయి.